Verse
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును‖ 3x ‖
Verse
శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము
Verse
నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము