Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samarthuda Naa Yesayya

సమర్థుడా నా యేసయ్య

Samarthuda Naa Yesayya

Lyricist: Akshay Ezra Sastry Sonti
Intro
సమర్థుడవైన దేవా నాకు చాలిన దేవుడా నీవే
సమర్థుడవైన దేవా నా రక్షణకర్తవు నీవే
Chorus
సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే
సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే
Verse
నీటిబుడగ వంటి నా జీవితాన -నీదు ప్రేమతో నన్ను బలపరచితివే
చెదరియున్న నా వేదనలో - చేరదీసి నన్ను స్థిరపరచితివే
నన్ను బలపరచినవాడా నా బలము నీవే
నన్ను స్థిరపరచినవాడా నా సర్వము నీవే
Chorus
సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే
సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే
Verse
క్రుంగియున్న నా జీవితమున - కృపనిచ్చి నన్ను ధైర్యపరచితివే (నీదు కృప నిచ్చి)‖ నీదు కృప నిచ్చి ‖
ఒంటరైన నా అడుగులలో - తోడైయుండి నన్ను ఆదరించితివే
నన్ను ఓదార్చినవాడా నా ఆదరణ నీవే
నన్ను నడిపించిన వాడా నా ధైర్యము నీవే
Chorus
సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే
సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే
Verse
సమర్థుడవైన దేవా నాకు చాలిన దేవుడా నీవే
సమర్థుడవైన దేవా నా రక్షణకర్తవు నీవే
సమర్థుడవైన దేవా నన్ను విడువని నాథుడా నీవే
సమర్థుడవైన దేవా నా విమోచకుడవు నీవే
సమర్థుడవైన దేవా నా గొప్ప దేవుడ నీవే
సమర్థుడవైన దేవా నా మహిమాన్వితుడవు నీవే
సమర్థుడవైన దేవా నా ప్రధానశిల్పివి నీవే
Chorus
సమర్థుడా యేసయ్య నా సామర్ధ్యం నీవే
సమర్థుడా యేసయ్య నా రక్షణ శృంగము నీవే
సమర్థుడా యేసయ్య నా సర్వము నీవే
సమర్థుడా యేసయ్య నా బలము నీవే
సమర్థుడా యేసయ్య నా ధైర్యము నీవే
సమర్థుడా యేసయ్య నా ఆధారం నీవే
సమర్థుడా యేసయ్య నా సారధి నీవే
సమర్థుడా యేసయ్య నా అతిశయం నీవే
సమర్థుడా యేసయ్య నా ఆనందం నీవే
సమర్థుడా యేసయ్య నా శైలము నీవే
సమర్థుడా యేసయ్య నా ఆరాధన నీకే
సమర్థుడా యేసయ్య నా సహవాసం నీతో

Related Tags

WorshipDevotionalJesus