Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samastha Deshamulaara Andaru Paadudi Andaru Paadudi

సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి

Samastha Deshamulaara Andaru Paadudi Andaru Paadudi

Verse
యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. కీర్తన Psalm 100
Chorus
సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి
Chorus
అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి
Verse
సంతోషముగను యెహోవాను సేవించుడి
ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి
Verse
యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను కలుగ జేసిన వాడు
Verse
మనమెల్లర మాయనకు ప్రజలమైతిమి
ఆయన మేపు గొఱ్ఱెలమై యున్నవారము
Verse
కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో
ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి
Verse
ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి
ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి
Verse
దయామయుండగు యెహోవా కృప నిత్యము
ఆయన సత్యము తరతరములుండును

Related Tags

PraiseWorshipPsalm