Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samastha Janulaara Meeru Yehovaaku Sthuthigaanamu Paadi

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి

Samastha Janulaara Meeru Yehovaaku Sthuthigaanamu Paadi

Verse
సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు
Verse
తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప
బలియాయెన్ - శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి
Verse
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు - విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి
Verse
మోషేకు తన సేవను నొసగె - యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించు ఆయనను స్తుతియించుడి
Verse
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా - కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి
Verse
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము - నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి

Related Tags

PraiseWorshipPsalm