Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samastha Janulaaraa

సమస్త జనులారా

Samastha Janulaaraa

Lyricist: Songs Of Zion
Verse
సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు‖ 2x సమస్త ‖
Verse
తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్‖ 2x ‖
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును‖ 2x ‖
ఆయనను స్తుతియించుడి‖ సమస్త ‖
Verse
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి‖ 2x ‖
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు‖ 2x ‖
ఆయనను స్తుతియించుడి‖ సమస్త ‖
Verse
మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె‖ 2x ‖
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి‖ 2x ‖
ఆయనను స్తుతియించుడి‖ సమస్త ‖
Verse
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో‖ 2x ‖
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు‖ 2x ‖
ఆయనను స్తుతియించుడి‖ సమస్త ‖
Verse
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము‖ 2x ‖
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట‖ 2x ‖
ఆయనను స్తుతియించుడి‖ సమస్త ‖

Related Tags

PraiseWorshipThanksgiving