Verse 1
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్…
Chorus
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి‖ 2x ‖
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని‖ 2x ‖
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా‖ 4x ‖
Verse
పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని‖ 2x ‖
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని‖ 2x ఆర్భాటించి ‖
Verse
వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని‖ 2x ‖
మార్గం సత్యము జీవం యేసని
మోక్ష ద్వారమై పుట్టినాడని‖ 2x ఆర్భాటించి ‖
Outro
సంబరాలు సంబరాలు చేసేద్దామా‖ 5x ‖
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా