Chorus
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
Verse
చలి రాతిరి ఎదురు చూసే – తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే – దూతలేమో పొగడ వచ్చే…!‖ 2x ‖
పుట్టాడు పుట్టాడురో! రారాజు – మెస్సయ్య పుట్టాడురో! మనకోసం!‖ 2x ‖
Verse
పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు‖ 2x ‖
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో‖ 2x ‖
Verse
చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు‖ 2x ‖
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు‖ 2x ‖