Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sambaraalu Santhoshaalu

సంబరాలు సంతోషాలు

Sambaraalu Santhoshaalu

Lyricist: Joshua Shaik
Chorus
సంబరాలు సంతోషాలు
యేసు ఉంటె చాలు సందడులు‖ 2x ‖
Verse
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి
మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది
ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ
Chorus
సంబరాలు సంతోషాలు
యేసు ఉంటె చాలు సందడులు
Verse
గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి
దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు
నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు
నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు
ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు
మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు
పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు
నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు
ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు

Related Tags

JesusChristmasCelebration