Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sambaramaascharyalatho bhoomi oopiri bigabatteney

సంబరమాశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే

Sambaramaascharyalatho bhoomi oopiri bigabatteney

Lyricist: Dr Shalem Raj, Azuba Daniel Kalyanapu
Verse
సంబరమాశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే
శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడెనే
ఆకాశం చుక్కలతో అలంకరించుకొనెనే
అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపింది
చమకు చమకు మంటు ఒక తార వెలసెనే
నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే
ఊరు వాడ వీధుల్లలో సందడి చేద్దామే
Chorus
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
బేత్లెహేము పురములోన సందడి చేద్దామే
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
దావీదు పురములోన సందడి చేద్దామే
Verse
నక్షత్ర రాశులు వింత కాంతులు ఈనే
సర్వదూతాలి సిద్దపడెనే
యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే
సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే
అయ్యో మరియమ్మ అవమానము పొందే
గాబ్రియేలు దూతొచ్చి భయపడకని చెప్పెనే
పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడని చెప్పెనే
సర్వోన్నతుని కుమారుడని చెప్పెనే
యుగయుగాలనేలే రారాజు
నీలో నుండి వచ్చుననెనే
ఇమ్మానుయేలు దేవుడు
ఏసుక్రీస్తు అని చెప్పెనే
నదులు సంతోషముతో ఉప్పొంగెనే
అలలు నాట్యమాడి స్తుతియించెనే
సస్యశ్యామలం గుసగుసలాడే
శాంతి సమాధానం వచ్చిందని చెప్పెనే
సర్వ భూమి నీ రాకతో పరవశించెనే
సృష్టి తలవంచి స్వాగతించెనే

Related Tags

ChristmasNativityCelebration