Verse
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా‖ 2x ‖
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది‖ 2x సమీపించరాని ‖
Verse
ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే‖ 2x ‖
ఖలునకు కరుణను నొసగితివి‖ 2x యేసయ్యా ‖
Verse
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది‖ 2x ‖
తులువకు విలువను ఇచ్చినది‖ 2x యేసయ్యా ‖