Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sampoorna Jeevamu Sampathi Naaku Gaa

సంపూర్ణ జీవము సంపత్తి నాకు గా

Sampoorna Jeevamu Sampathi Naaku Gaa

Lyricist: Frances Ridley Havergal
Verse
సంపూర్ణ జీవము
సంపత్తి నాకు గాన్
సంతప్త మొందుచు
చావును బొందితి
నీకై చావును బొందితి
నాకేమి చేతువు?
Verse
నెమ్మయిన రాజ్యము
నీ నొందులాగున
నా నెత్రు కార్చుచు
నా ప్రాణమిచ్చితి
నా ప్రాణమిచ్చి ప్రోచితి
నాకే మిచ్చితివి?
Verse
నా తండ్రి యింటిని
నా సింహాసనమున్
నా గౌరవంబును
నా వెల్లమానితి
నా వెల్లమానివచ్చితి
నీవే మిచ్చెదవు?
Verse
చెప్పరాని బాధలన్
పొందుచు సిల్వపై
చిందితి రక్తము
చివ్వున బ్రోవను
చింతల నీకై యోర్చితి
చింతల నోర్తువా?
Verse
నీ క్షమాపణమున్
రక్షణ మార్గమున్
అక్షయభాగ్యమున్
ఆశించి తెచ్చితిన్
నీకై రక్షణ తెచ్చితిన్
నాకేమి యిత్తువు?

Related Tags

SalvationSacrificeDevotion