Chorus
సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా‖ సంపూర్ణ ‖
Verse
నిర్మల మనసు రంజిల్ల నిత్య పరమానందంబు నా యాత్మలో నెరపు
ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప పరితాప మనుదినం బభివృద్ధిపరచి‖ సంపూర్ణ ‖
Verse
విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం
తోషంబుగ సేవించుటకు నీదు నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా‖ సంపూర్ణ ‖
Verse
నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ బాలించు ప్రభునికై బ్రతుకంగ
నిమ్ము చాల తనదు మహిమఁ బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని పెట్టునట్లు‖ సంపూర్ణ ‖
Verse
నా పాపములె యేసునాధున్ ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ
జేసెన్ నా పాపములకు దుఃఖింతున్ దేవ కాపాడుమీ నన్నుఁ పాపంబునుండి‖ సంపూర్ణ ‖
Verse
పెక్కంత శుద్ధిని బొంది నేను ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ
బడి యుండునపుడు నీతి లోకమం దా సక్తి మిక్కుట పరచి‖ సంపూర్ణ ‖
Verse
నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు ధరణి నీవలె నేను వర్తించునట్లు‖ సంపూర్ణ ‖