Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samsthutinthumu Ninne Saulunu Vidachithivi

సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి

Samsthutinthumu Ninne Saulunu Vidachithivi

Verse
సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి
దావీదును కోరుకొని - దీవించిన యెహోవా
Verse
యెష్షయి పుత్రులలో - ఎర్రని వాడతడు
నేత్రాలు చక్కనివి - నేర్పరి మాటలలోన
Verse
రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి
గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు
Verse
బెత్లెహేమునందు - ఖ్యాతిగా వాయించి
సొంపగు పాటలు పాడే - సుగుణాల సుందరుడు
Verse
పరమగీతము పాడే - పావనుడు మన యేసు
నేర్పరి మాటలలోన - నజరేతు నివాసి
Verse
వీరుడగు యౌవనుడు - శూరుడు యుద్ధమున
తల్లిని మించి యెహోవా - తనతోడై యున్నాడు
Verse
నేను కోరిన దితడే - వాని అన్నలముందు
అభిషేక తైలముతో - అభిషేకించుము వాని
Verse
సంఘవరుడగు క్రీస్తు - సత్యముగ మన శిరస్సు
ఆత్మాభిషిక్తుండై - అలరారుచున్నాడు

Related Tags

WorshipAnointing