Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samulevvaru Deva

సములెవ్వరు దేవా

Samulevvaru Deva

Verse
సములెవ్వరు దేవా నీతో సమానులెవరు దేవా
వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు దేవా
పూజ్యులలోనా నీ వంటి ఘనుడు ఎవరున్నారు దేవా
Verse
నిత్యనివాస స్థలము నీవే సత్యసమాధాన గృహము నీవే
అత్యున్నత సింహాసనాశీనుడా నే నిలచియుంటిని నీలోనే
ఆశ్చర్యకరుడా నా యేసయ్యా నే దాగియుంటిని నీలోనే
Verse
నిత్యాశ్రయ దుర్గము నీవే సర్వాధికారుడవు నీవే
సర్వోన్నత సత్య దేవుడా జీవించుచుంటిని నీతోనే
సహాయకుడా నా యేసయ్యా నమ్మియుంటిని నీ ప్రేమనే
Verse
రక్షణాజీవము నీవే జీవమార్గము నీవే
నమ్మదగిన నిజ దేవుడా నీ కృప నాకు చాలునయా
సమాధానకరుడా నా యేసయ్యా నీ ప్రేమ నాకు చాలునయా

Related Tags

PraiseWorshipDevotional