Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa

సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా

Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa

Lyricist: Bro Nissy John
Verse
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా‖ 2x సంవత్సరములు ‖
Verse
గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు‖ 2x ‖
శత్రువల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు‖ 2x నీకే ‖
Verse
బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు‖ 2x ‖
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు‖ 2x నీకే ‖

Related Tags

ThanksgivingGraceNew Year