Verse
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు‖ 2x సందేహమేల ‖
Verse
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే‖ 2x ‖
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే‖ 2x సందేహమేల ‖
Verse
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు‖ 2x ‖
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా‖ 2x సందేహమేల ‖
Verse
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా‖ 2x ‖
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా‖ 2x సందేహమేల ‖
Verse
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు‖ 2x ‖
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా‖ 2x సందేహమేల ‖