Intro
సందేహమేల - సంశయమదేల
ప్రభు యేసుగాయములను పరికించిచూడు
గాయాలలో నీవ్రేలు తాకించి చూడు
Verse
ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను యేసు భరియించెనే‖ 2x ‖
ప్రవహించె రక్తధార నీ కోసమే
కడు గోర హింసనొందె నీ కోసమే‖ 2x సందేహ ‖
Verse
లోకాన ఎవ్వరు నీకై మరణించరు
నీ శిక్షలను భరయింప సహయింపర‖ 2x ‖
నీ తల్లియైన గాని నిను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా‖ 2x సందేహ ‖
Verse
ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు
ఎందాక హృదయము బయట నిలువ మందువు‖ 2x ‖
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా‖ 2x సందేహ ‖
Verse
ఈ లోక బోగాలను వీడజాలవా
సాతాను బందకమందే సంతసింతువా‖ 2x ‖
యేసయ్య సహనము తోడ చెలగాటమా
ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా‖ 2x సందేహ ‖