Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sandiyamu Veedave Naa Manasaa Yaa Nandamu

సందియము వీడవే నా మనసా యా నందము

Sandiyamu Veedave Naa Manasaa Yaa Nandamu

Lyricist: Purushothamu Choudari
Chorus
సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము
లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము
లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు‖ సందియము ‖
Verse
చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము
ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత
లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని‖ సందియము ‖
Verse
పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు
మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి
వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని‖ సందియము ‖
Verse
నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార
ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ
మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని‖ సందియము ‖
Verse
నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము
ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ
చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని‖ సందియము ‖
Verse
ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ
మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ
జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక‖ సందియము ‖

Related Tags

FaithSalvationRest