Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sangeetha Naadamutho Sthothra

సంగీత నాదముతో స్తోత్ర

Sangeetha Naadamutho Sthothra

Verse
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా‖ సంగీత ‖
Verse
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద‖ 2x ‖
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన‖ నీ ప్రేమ ‖
Verse
నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద‖ 2x ‖
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన‖ నీ ప్రేమ ‖
Verse
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద‖ 2x ‖
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన‖ నీ ప్రేమ ‖

Related Tags

PraiseWorshipThanksgiving