Chorus
సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ
క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా‖ సంఘ ‖
Verse
సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము
నీవే సర్వలోక నిరీక్షణ నీవే‖ సంఘ ‖
Verse
తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె
క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు‖ సంఘ ‖
Verse
నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు
నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు‖ సంఘ ‖
Verse
ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు
జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు‖ సంఘ ‖
Verse
విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై
వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా‖ సంఘ ‖