Verse
సంఘమే క్రీస్తు యేసుని శరీరము
అందు చేరిన వారే అంగములు
Verse
ఆత్మ మూలముగా దేవుని కాలయముగా
కట్టబడు చున్నారు పరిశుద్ధాత్మచే
స్థిరులై యుండెదరు యెవరు నిలిచి యుందురో
Verse
మర్మమైయున్న దేవుని సంకల్పము
సంఘము ద్వారా ఇహమునకు తెలిపెను
ఎవరు విశ్వసింతురో వారే ధన్యులగుదురు
Verse
దేవునికే క్రీస్తు యేసు మూలముగా
మహిమ కలుగును గాక తరతరములు
ఎవరు మహిమ పరతురో వారే స్వాస్థ్యమగుదురు
Verse
క్రీస్తు యేసు సంఘమును కట్టు చుండగా
ప్రబల లేవు పాతాళ ద్వారములు
ఎవరు జయము గాంతురో వారే తనతో నుందురు
Verse
వధువు సంఘముకై క్రీస్తు వచ్చుచుండగా
తానే కొనిపోవును శుద్ధులైన వారిని
ఎవరు సిద్ధపడెదరో వారే యెత్తబడెదరు