Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sanghamokkatae Saarvathrika Sanghamanedi Sangha Mokkatae

సంఘమొక్కటే సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటే

Sanghamokkatae Saarvathrika Sanghamanedi Sangha Mokkatae

Verse 1
Reference: నాయందు విశ్వాసముంచు వారందరు ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను యోహాను John 17:21
Chorus
సంఘమొక్కటే, సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటే
Chorus
శిరస్సు నొకటే శరీర మొకటే - నిత్యశక్తి గల్గినట్టి
Verse
యే నరుని పేరులేని సంఘమిది
యే సిద్ధాంతపు పేరులేని సంఘము
స్థానదినముల పేరు లేనిదిది
ఏలాటి పేరు వహించనియట్టి
Verse
యూదులని హెల్లేనీయులని లేదు
సున్నతిపొందియున్న లేకున్నను
దేశీయుడు పరదేశీయని లేదు
స్వాతంత్ర్య దాస్య స్త్రీ పురుషుడని లేని
Verse
ఆత్మైక్యమను యేడు పేటలత్రాడు
ఈ త్రాటిచే సంఘము కట్టబడెను
ఇట్టి జీవముకల్గి లోకమునకు
వేరైన జీవము జీవించుచున్నట్టి
Verse
సంఘమే శరీరం శరీరమే సంఘం
దివ్య దృష్టాంతములతో నిండినది
దేవుని ఇల్లాయన నివాసస్థలం
నవీన వరుడు రాజనగరము ఇల్లు
Verse
ఇంటికి పునాది ఆధారమైనట్లు
ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చునట్లు
నర శరీరమునకు తలవలె
భార్యకు భర్తవలె క్రీస్తునుగల
Verse
సార్వత్రిక సభను కానగ లేని
కారణాన సైతాను కలవరమునొందె
స్థల సంఘము ద్వారా సార్వత్రికమైన
సంఘమునుజూప వీలగు నిజము
Verse
మరుజన్మ మొందినవారే యీ సంఘము
అసమాను డేసుడే యద్దాని శిరము
యోగ్యముగా నైదుసేవల జేతుము
ముదమున పాడుము హల్లెలూయ

Related Tags

UnityChurchBody Of Christ