Chorus
సన్నుతించెదను - దయాళుడవు నీవని‖ 1x ‖
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను‖ 2x ‖
సన్నుతించెదను - దయాళుడవు నీవని‖ 1x ‖
Verse
సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా‖ 2x ‖
కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను‖ 2x సన్నుతించెదను ‖
Verse
నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును‖ 2x ‖
కృపానిధివి నీవెగా నా యేసురాజా - నిను సన్మానించెదను‖ 2x సన్నుతించెదను ‖