Verse 1
Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1
Chorus
సన్నుతించెదను ఎల్లప్పుడు
నిత్యము ఆయన కీర్తి నానోటనుండు
Verse
యెహోయాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను
శ్రమలన్నిటిలో నాతో నుండి‖ 2x ‖
చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు
Verse
జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా
నా ఆయుష్కాల మంతయును‖ 2x ‖
నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు
Verse
మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా
తనివి తీరగ నిను పూజింతు‖ 2x ‖
తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు
Verse
నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను
నాకు ప్రభుడవై నా కాపరివై‖ 2x ‖
నా జీవితములో వున్నావు - నిజముగ నిన్ను పొగడెదను