Verse
సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా‖ 1x ‖
Verse
నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా పతితపావన నామకా‖ 2x ‖
Verse
మానవ సంరక్షకా దీన నిచయ పోషకా
దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా‖ 3x ‖
Verse
ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా
కామిత ఫలదాయక స్వామి యేసు నాయక‖ 4x ‖
Verse
పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్‖ 5x ‖