Verse
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1-10
Chorus
సన్నుతింతు నెప్పుడెహోవాను - తన కీర్తి నా నోట నుండును
Verse
అతిశయింతు నెహోవానుబట్టి - సంతోషింతురు దీనులు విని
Verse
ఘనపరచుడి దేవుని పేరు - గొప్ప చేయుదము ఏకముగా
Verse
తనయొద్ద నే విచారించగా - తప్పించె నన్ను భయముల నుండి
Verse
తనను చూడగ వెల్గు కలిగెను - తమ ముఖములు లజ్జింపకుండె
Verse
యెహోవా భక్తులందరి చుట్టు - దూత కావలి యుండి రక్షించు
Verse
దేవుడుత్తముడని రుచిచూడు - ధన్యుడు తన్నాశ్రయించువాడు
Verse
ఆకలెత్తు సింహపు పిల్లలకు - ఆశ్రితుల కేమి కొదువలేదు