Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sannuthinthumo Prabho

సన్నుతింతుమో ప్రభో

Sannuthinthumo Prabho

Verse
సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో‖ 2x ‖
కన్న తండ్రి కావుమా‖ 2x ‖
కలుషము నెడబాపుమా‖ సన్నుతింతుమో ‖
Verse
నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా‖ 2x ‖
పాతక జన రక్షకా‖ 2x ‖
పతిత పావన నామకా‖ సన్నుతింతుమో ‖
Verse
మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా‖ 2x ‖
దేవా మానవ నందనా‖ 2x ‖
దివ్య సుగుణ మందనా‖ సన్నుతింతుమో ‖
Verse
ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా‖ 2x ‖
కామిత ఫలదాయక‖ 2x ‖
స్వామి యేసు నాయక‖ సన్నుతింతుమో ‖
Verse
పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో‖ 2x ‖
నీ పవిత్ర నామమున్‖ 2x ‖
నిరతము స్మరియించెదన్‖ సన్నుతింతుమో ‖

Related Tags

PraiseWorshipDevotional