Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhasambuna Vaththu Sarveshwaruni Chi

సంతసంబున వత్తు సర్వేశ్వరుని చి

Santhasambuna Vaththu Sarveshwaruni Chi

Lyricist: మొలతాటి విద్యానందము
Verse
సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు
విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును
బ్రభువా‖ సంత ‖
Verse
సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును
మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద
భక్తితో సేవింతు‖ సంత ‖
Verse
నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు
సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొసగును‖ సంత ‖
Verse
కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ
రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ నుంచు‖ సంత ‖
Verse
ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే
కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు‖ సంత ‖

Related Tags

WorshipDevotionService