Intro
Reference: ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అపొస్తలుల కార్యములు Acts 8:8
Chorus
సంతసిల్లును మీ హృదయాలు
సీయోను మహిమజూచి‖ 2x ‖
Verse
సుందర వరుడు యేసు ప్రభువు - సుందరవతి సీయోను
శాశ్వత శోభాతిశయముతో - భాసిల్లుటను జూచి
Verse
నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు
సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము
Verse
నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు
స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము
Verse
జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము
కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము
Verse
స్వర్ణ సమము దాని ప్రజలు సంతోష సహితులు
దూతలే వింతపడునట్లు ఖ్యాతిని కలిగిన వారు
Verse
మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు
ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు
Verse
దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది
జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్