Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhoshame Santhoshame Santhoshamutho Sthuthinchedan

సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్

Santhoshame Santhoshame Santhoshamutho Sthuthinchedan

Verse
సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్
క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో
Verse
ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగా
భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను
Verse
అక్షయమైనదియు - నిర్మలమైనదియు
రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చున్
Verse
భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు
దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్
Verse
మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ
మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు
Verse
దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి
శోధింప నెంతో అశక్యములు - అగమ్యములు
Verse
నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను
రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా?
Verse
మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న
మహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి
Verse
రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే
పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి

Related Tags

PraiseWorshipJoy