Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhoshamutho Nichchedu Vaarini

సంతోషముతో నిచ్చెడు వారిని

Santhoshamutho Nichchedu Vaarini

Verse
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును‖ సంతోషముతో ‖
Verse
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు‖ సంతోషముతో ‖
Verse
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు‖ సంతోషముతో ‖
Verse
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై‖ సంతోషముతో ‖
Verse
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను‖ సంతోషముతో ‖
Verse
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను‖ సంతోషముతో ‖

Related Tags

FaithfulnessOfferingGenerosity