Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhoshimpare Priyulara Yesuni Cha

సంతోషింపరె ప్రియులారా యేసుని చ

Santhoshimpare Priyulara Yesuni Cha

Lyricist: A B Masilamani
Chorus
సంతోషింపరె ప్రియులారా యేసుని చెంత సంతసింపరె మనసార
ఎంతో ప్రేమించి య నంతు డొసగెను సుతుని వింతగ బ్రతుకువ సంత
శోభను దాల్చె అంతరంగములో వసించిన చింత లెల్లను వాడ బారెను
గంతు లిడుచును నూత్నజీవ ల తాంతములు పూయంగ దొడగెను‖ సంతో ‖
Verse
సిలువలో వలరారిన యేసునిప్రేమ ఫలియించె హృది వనమున
కలుష మెల్లను బాపు కలువరిలో భక్తి పలవులు చిగిరించి చెలుని పాద
పద్మములు అలుముకొని యా రాధనంబున మలయ మారుత వీచికలపై
మలపు గొనుచు సమర్పణంబును సులలితముగా జేయ దొడగెను‖ సంతో ‖
Verse
పాపతాపము తొలగెను జీవితపు తుఫానులన్నియు నణగెను ప్రాచీన
సర్పము పగబట్టి పడగెత్తి పంతమున ననుడాసి పటువున కఱవంగా
పాప మరణపు విఱుగుడగునా ప్రభుని యమృత రక్తసారము ప్రాణ భిక్షను
బెట్టెను మరి పగతుని యోడించె న హాహా‖ సంతో ‖
Verse
యాత్ర పథమున యేసుడు ప్రకాశింప రాత్రియె పగలాయెను నేత్రములు
వికసింప ధాత్రి నా బసలోప విత్ర వాక్యములో వి చిత్ర కృపలను గాంచి
గాత్ర వీణను మీటి దేవుని స్తోత్ర గీతము పాడి పుణ్య క్షేత్ర పథమున
బోవ యేసుడు మిత్రుడై నడిపింప దొడగెను‖ సంతో ‖
Verse
సిరిసంపదలు యున్నను లేకున్నను కఱుణావరములు తరుగవు
పైరు పంటలు గాని పరువు ప్రతిష్టలు కఱువైనగానినే మురియుదు
మదిలోన గిరులపైనను పరుగు లిడుటకు హరిణ పాదము లొసగె యేసుడు
వెఱతునా చింతింతునా క ల్వరిని ప్రేమలు కురియుచుండగ‖ సంతో ‖

Related Tags

PraiseWorshipJoy