Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhoshinchudi Yandaru Naatho Santhoshi

సంతోషించుఁడి యందరు నాతో సంతోషి

Santhoshinchudi Yandaru Naatho Santhoshi

Lyricist: Bethala John
Chorus
సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు
కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో‖ సంతో ‖
Verse
అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా
వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు‖ సంతో ‖
Verse
కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర
కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె‖ సంతో ‖
Verse
మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ
దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె
భక్తుల కన్ను లాస దీరె‖ సంతో ‖
Verse
ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ
పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ
నాతురపడవలెను‖ సంతో ‖
Verse
పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ
గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము
వేగము జూపుద మా పథము‖ సంతో ‖

Related Tags

PraiseChristmasJoy