Verse
శరణము నీవే యేసయ్య నా ఆధారమైనావయ్యా..
పరిశుద్ధుడవు నీవయ్యా నను నీ వలె మార్చావయ్యా..
స్తుతియాగము నీకే అర్పింతును
కృపలోనే నిత్యము జీవింతును..
Chorus
ఆధారం కృపయే..
ఆనందం నీలోనే..
అతిశయం నీ కృపయే..
ఆశ్రయం నీలోనే…
Verse
కరుణామూర్తిగా దిగివచ్చిన..
కరములు చాపి కరుణించిన..
కలుషము బాపి నను మార్చిన
కనికరించిన నీ కృప..
Chorus
నీ కృపలోనే..ఆ..
నీ కృపలోనే నాకు క్షేమము
నీ కృపయే నా ఆధారము..
ఆ కృపలోనే నన్ను నడిపించవా…
Verse
నిజ స్నేహితుడవు నీవేనయ్యా..
నను ప్రేమించిన సాత్వీకుడా..
నిరతము నన్ను ఎడబాయక
నడిపించినదీ నీవేనయ్యా..
Chorus
మార్గము నీవే…ఆ…
మార్గము నీవే సత్యము నీవే
మరణము గెలిచిన జయశీలుడా…
మమ్ము కొనిపోగా రానున్న మహనీయుడా..