Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sari Cheyumo Devaa

సరి చేయుమో దేవా

Sari Cheyumo Devaa

Verse
సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా‖ 2x ‖
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా‖ 2x సరి ‖
Verse
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను‖ 2x ‖
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి‖ 2x ‖
బ్రతిమాలుచున్నాను
నన్ను సరి చేయుమో దేవా‖ 2x సరి ‖
Verse
నింపుము నీ వాక్యమును మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణము‖ 2x ‖
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేవేల దినములకంటే శ్రేష్టము‖ 2x ‖
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా‖ 2x సరి ‖

Related Tags

PrayerRepentanceSurrender