Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sari Raarevvaru Naa

సరి రారెవ్వరు నా

Sari Raarevvaru Naa

Verse
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి‖ 2x సరి ‖
Verse
నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే‖ 2x ‖
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే‖ 2x ‖
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే‖ 2x సరి ‖
Verse
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే‖ 2x ‖
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే‖ 2x ‖
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే‖ 2x సరి ‖
Verse
పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే‖ 2x ‖
శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే‖ 2x ‖
నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే‖ 2x సరి ‖

Related Tags

PraiseWorshipJesus