Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saricheyumo Devaa

సరిచేయుమో దేవా

Saricheyumo Devaa

Lyricist: Kranthi Chepuri
Verse
సరిచేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా‖ 2x ‖
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా‖ 2x సరి ‖
Verse
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్న
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి
బ్రతిమాలుచున్నాను
నన్ను సరి చేయుమో దేవా‖ 2x సరి ‖
Verse
నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణము
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని
తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా‖ 2x సరి ‖

Related Tags

PrayerRepentanceCorrection