Chorus
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి‖ 2x ‖
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
Verse
నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే‖ 2x ‖
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే‖ 2x ‖
Chorus
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
Verse
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే‖ 2x ‖
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే‖ 2x ‖
Chorus
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
Verse
పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే‖ 2x ‖
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే‖ 2x ‖
Chorus
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి‖ 2x ‖
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు‖ 2x ‖