Verse
సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
స్తొత్రముచేసి స్తుతి౦చెదను స౦తసమున నిను పొగడెదను
Pre-Chorus
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆన౦దముతో సాగెదను నే నాన౦దముతో సాగెదను
Verse
ప్రేమి౦చి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షి౦చితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణి౦చితివి
Verse
అల్పకాల శ్రమలనుభవి౦ప అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
Verse
మరణ శరీరము మార్పునో౦ది మహిమ శరీరము పొ౦ధుటకై
మహిమాత్మతో నను ని౦పితివి మరణ భయములను తీర్చీతివి