Verse 1
Reference: వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ప్రకటన Revelation 14:3
Verse
సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదను సంతసమున నిను పొగడెదను
Chorus
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను నే నానందముతో సాగెదను
Verse
ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణించితివి
Verse
అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
Verse
మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొంధుటకై
మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి
Verse
భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి
Verse
ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను