Verse
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
ప్రభుని నామమును ప్రబల పరచెదం‖ 2x ‖
ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు
స్తుతి మహిమలు సదా అర్పించెదం
అతి సుందరుడు మహిమైశ్వరుడు
ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు‖ సర్వ ‖
Verse
అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు
అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు‖ 2x ‖
సంతోషించుమా ఆనందించుమా
ఆయన చేసినవి మరువకుమా
సన్నుతించుమా మహిమ పరచుమా
ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు‖ సర్వ ‖
Verse
శోధన వేదన ఏది ఎదురైనా
మొరపెడితే చాలునే విడిపిస్తాడే‖ 2x ‖
రక్షకుడేసు రక్షిస్తాడు
ఆయన నామములో జయం మనదే
ఇమ్మానుయేలు మనలో ఉండగా
జీవితమంతా ధన్యమే ధన్యమే‖ సర్వ ‖