Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Shakthuni Sthothragaanamu Salpa

సర్వ శక్తుని స్తోత్రగానము సల్ప

Sarva Shakthuni Sthothragaanamu Salpa

Lyricist: Mikkili Samuel
Chorus
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస
భారము నిత్య మెద రాజిల్లను‖ సర్వ ‖
Verse
ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి
దేవుని వందనముతో వేఁడరే‖ సర్వ ‖
Verse
వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా
దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే‖ సర్వ ‖
Verse
ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు
భక్తితో మీ సర్వ మాయన కీయరే‖ సర్వ ‖
Verse
చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ
దన్ను వేఁడు మహేష్టులను రక్షించును‖ సర్వ ‖
Verse
దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని
పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే‖ సర్వ ‖

Related Tags

PraiseWorship