Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Shakthuni Vaakku Idhiye Samasthamunu Meeve

సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే

Sarva Shakthuni Vaakku Idhiye Samasthamunu Meeve

Chorus
సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే
Verse
పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను
లోకమైన యేమియైన - సర్వమును మీవే
Verse
జీవమైన మరణమైన - రాబోవునవైన
ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే
Verse
దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే
అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే
Verse
దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు
సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే
Verse
నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె
పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే
Verse
జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని
దేవుని కుమారిలగుట - దినదినము మీదే
Verse
పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము
క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే

Related Tags

WorshipChristian