Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Yugamulalo Sajeevudavu

సర్వ యుగములలో సజీవుడవు

Sarva Yugamulalo Sajeevudavu

Verse
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే‖ 2x ‖
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా‖ 2x సర్వ యుగములలో ‖
Verse
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే‖ 2x ‖
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా‖ 2x సర్వ యుగములలో ‖
Verse
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను‖ 2x ‖
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా‖ 2x సర్వ యుగములలో ‖

Related Tags

PraiseWorshipJesus