Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Yugamulalo Sajivudavusaripolcha

సర్వ యుగములలో సజీవుడవుసరిపోల్చ

Sarva Yugamulalo Sajivudavusaripolcha

Lyricist: John Wesley
Verse
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా
Verse
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
Verse
స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా
Verse
కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా

Related Tags

PraiseWorship