Verse
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా‖ 2x ‖
Verse
నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా‖ 2x ‖
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా‖ 2x సర్వాంగ ‖
Verse
నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా‖ 2x ‖
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా‖ 2x సర్వాంగ ‖
Verse
నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా‖ 2x ‖
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా‖ 2x సర్వాంగ ‖