Verse
సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న
మాంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును‖ సర్వ ‖
Verse
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు
నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకున్న పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబుబోవ నను గడుగుమా‖ సర్వ ‖
Verse
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల
చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ
చేతబట్టినన్ రక్షింపుమా‖ సర్వ ‖
Verse
ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా
నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా‖ సర్వ ‖