Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvachittambu Needhenayya Svarupamichu

సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు

Sarvachittambu Needhenayya Svarupamichu

Verse
సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును
Verse
ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు బోవ నను కడుగుమా
Verse
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా
నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే నీచేతబట్టి నన్ రక్షింపుమా
Verse
ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీయాత్మతో ఆవరింపుమో నా రక్షకా
అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా

Related Tags

PrayerSurrenderPotter