Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvadeshamulara Sri Yesese Devunda

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండ

Sarvadeshamulara Sri Yesese Devunda

Lyricist: Narella Namuyelu Subbayya
Verse
సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో
గురుస్తోత్రము జేయను రండి‖ సర్వ ‖
Verse
ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని
బుట్టించిన భగవంతుండు‖ సర్వ ‖
Verse
మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా
ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము‖ సర్వ ‖
Verse
కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి
వినయముతోఁజేరండి‖ సర్వ ‖
Verse
ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ
సత్యం బనవరతం బుండును నిజమే‖ సర్వ ‖
Verse
శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్
అనయము గొలువుడి జనులారా‖ సర్వ ‖

Related Tags

PraiseWorship