Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvajanulaaraa Chappatlu Kotti Paadudi

సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి

Sarvajanulaaraa Chappatlu Kotti Paadudi

Verse
సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి
జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి
Verse
యెహోవా మహోన్నతమైన భయంకరుడు
మహారాజై యున్నాడు సకల జగమునకు
Verse
జనముల నెహోవా మనకు లోపర్చును
జనుల మన కాళ్ళ క్రింద అణగ ద్రొక్కును
Verse
తన ప్రియ యాకోబుకు మహాతిశయముగ
మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేసెను
Verse
దేవుడార్భాటముతో నారోహణమాయెను
బూరధ్వనితో యెహోవారోహణమాయెను
Verse
మన దేవుని కీర్తించుడి కీర్తించుడి
మన రాజును కీర్తించుడి కీర్తించుడి
Verse
రాజై యున్నాడు యెహోవా యీ సర్వభూమికి
రమ్యముగా సంకీర్తనలు మీరు పాడుడి
Verse
దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు
పరిశుద్ధ సింహాసనాసీనుడై యున్నాడు
Verse
జనుల ప్రధాను లబ్రాహాము దేవునికి
జనులై యేకముగా కూడుకొనియున్నారు
Verse
మహోన్నతుడు ఆయెను యెహోవా దేవుడు
మనము వేసికొను కేడెములు తనవి

Related Tags

PraiseWorshipPsalm